20.8.25

శాస్త్రోక్తంగా శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్ప‌ణ‌sri venugopala swamy vari temple




కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం సాయంత్రం పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.


ఇందులో భాగంగా ఉద‌యం సుప్ర‌భాతంతో స్వామి, అమ్మ‌వార్ల‌ను మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుద్ది జ‌రిగింది. ఉద‌యం 10 గంట‌ల‌కు  ఆచార్య రుత్విక్ వ‌ర‌ణం నిర్వ‌హించారు. సాయంత్రం  6 గంట‌ల నుండి మేదినీ పూజ‌, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, అంకురార్ప‌ణం నిర్వ‌హించారు.

ఆగస్టు 20వ తేదీన ఉదయం మూలవర్లకు తిరుమంజనం, పవిత్రాల సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరువీధి ఉత్సవం, యాగ‌శాల‌లో వైధిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగుస్తాయి.  

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

No comments :
Write comments