17.8.25

తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టీటీడీ తరఫున శ్రీవారి సారె srivari Sare to tirutani subramanya varu










ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు శనివారం శ్రీవారి సారె సమర్పించారు.


ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో తిరుత్తణి ఆలయ చైర్మన్ శ్రీ శ్రీధర్, తమిళనాడు దేవాదయశాఖ జాయింట్ కమిషనర్ శ్రీమతి రమణి టీటీడీ చైర్మన్‌కు స్వాగతం పలికారు.

తదుపరి మంగళవాయిద్యాల నడుమ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను తిరుత్తణి దివ్య క్షేత్రంలో "తనీకేసన్'' గా పూజలందుకునే శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి సమర్పించారు.

వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి దర్శన అనంతరం ఆలయ అర్చకులు టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు ఆశీర్వచనం అందించి, పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ టీటీడీ తరఫున శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి శ్రీవారి పట్టువస్త్రాలను సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఆడికృతిక పర్వదినం సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుత్తణి చేరుకుంటున్నారని,  భక్తులందరికీ స్వామివారి అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నానని తెలియజేశారు.

No comments :
Write comments