19.8.25

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సురక్షిత రవాణా : టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు surprise inspection




శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సురక్షితమైన రవాణ కోసం ఘాట్ రోడ్ల‌ల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన ఫూర్తి చేయాల‌ని టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు అధికారుల‌ను ఆదేశించారు.


అలిపిరి నుండి అప్ ఘాట్ రోడ్‌(రెండ‌వ ఘాట్ రోడ్‌)లో జ‌రుగుతున్న ప‌నుల‌ను సోమ‌వారం ఈవో ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో కాంక్రీట్ తో రీటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప‌రిశీలించారు. అక్క‌డ‌క్క‌డ తొట్టేలు ఏర్పాటు చేసి నీటితో నింపాల‌న్నారు. అదేవిధంగా పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తూ అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

భక్తులకు మ‌రింత ఆహ్లాదం కలిగించే విధంగా పూల మొక్కలతో  సుందరీకరించాలని, ఇందుకోసం అవసరమైన చోట భూమి చదువు చేసి తగిన పూల మొక్కలు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్ల‌ల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

No comments :
Write comments