2.8.25

తెలుగులో సహజ కవయిత్రి, యోగిని, భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ - మేడసాని మోహన్ Tarigonda Vengamamba







తిరుపతి,2025, ఆగష్టు 01: తెలుగులో ప్రత్యేక సహజ కవయిత్రిగా, యోగినిగా, భక్తురాలిగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రత్యేక గుర్తింపు ఉందని టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డా. మేడసాని మోహన్ అభివర్ణించారు. భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్థంతి మహోత్సవములను పురష్కరించుకుని తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సంగీత కచేరి, సాహితీ సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ మేడసాని మోహన్ మాట్లాడుతూ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వ్రాసిన 18 పుస్తకాలలో ఆద్యాత్మిక, భక్తి, మోగ అంశాలకు అధిక ప్రాదాన్యత ఇచ్చారన్నారు. ఇవేకాక ఆయా సందర్భాలలో అశువుగా చెప్పిన పద్యాలు, శ్లోకాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ సందర్భగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఆచార్యులు డా. వి.ఆర్. రాసాని మాట్లాడుతూ అక్షర జ్ఞానం లేని నిరక్ష్యరాస్యులు సైతం అర్థం చేసుకునేలా సంకీర్తనల ప్రక్రియను ఎంచుకుని శ్రీవేంకటేశ్వర మహాత్యాన్ని ప్రచారం చేశారని మాట్లాడారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల అద్యాపకురాలు డా. కొణిదల శోభ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవితం - సమాజానికి ఇస్తున్న సందేశం అనే అంశంపై, ఎస్వీ యూనివర్శిటీ ప్రాచ్యపరిశోధన సంస్థ ప్రతినిధి డా. తొండాటి రాజశేఖర్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విరచిత రమా పరిణయం అనే అంశంపై మాట్లాడారు.

అంతకుముందు అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమతి ఆర్. సుశీల, కుమారి కోనేరు లక్ష్మీరాజ్యం సంగీత కచేరి నిర్వహించారు. సాయంత్రం శ్రీమతి జి. లావణ్య, శ్రీ పి. శ్రీనివాస కుమార్ బృందం సంగీత కచేరి నిర్వహించనున్నారు.

ఆగష్టు 02వ తేదీ కార్యక్రమాలు

తిరుమలలో శనివారం ఉదయం 09.00 గం.లకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి, తిరుపతిలో శనివారం ఉదయం 09.00 గం.లకు ఎం.ఆర్. పల్లి కూడలిలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గం.లకు సంగీత కచేరి, ఉదయం 11.30 గం.లకు శ్రీ కె. చంద్రశేఖర్ బృందంచే హరికథ, సాయంత్రం సంగీత కచేరి చేపడుతారు. తరిగొండలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయంలో సాయంత్రం ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవం, సంగీత కచేరి, హరికథ నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ ఇంఛార్జ్ సంచాలకులు శ్రీ కె. రాజగోపాల రావు, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి సి. లత, తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments