9.8.25

తొండ‌మాన్‌పురం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ Tondamanpuram




తొండ‌మాన్‌పురం శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు.


ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు.

ఉద‌యం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంత‌రం చతుష్టార్చన, ప‌విత్ర సమర్పణ నిర్వ‌హించారు. ఇందులో మూలమూర్తులు, ధ్వజస్తంభం, పరివార దేవతలకు, ఉత్సవ మూర్తులకు పవిత్రలు సమర్పించారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూప‌రింటెండెంట్ శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సుదీర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

No comments :
Write comments