18.8.25

తిరుచానూరులో ఘనంగా ఉట్లోత్సవం utlotavam at tiruchanoor




తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఆదివారం సాయంత్రం వేడుకగా ఉట్లోత్సవం జరిగింది.

 
ఇందులోభాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు  శ్రీకృష్ణ స్వామివారి వారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 6.15 గంటల నుండి శ్రీకృష్ణస్వామివారి ఊరేగింపు సందర్భంగా ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో ఆలయఅధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments