9.9.25

సెప్టెంబర్ 10న శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 103వ జయంతి, శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 44వ వర్ధంతి PEDDI RAMASUBBA SHARMA




తిరుమల శ్రీవారికి అమూల్యమైన సేవలందించిన శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 103వ జయంతి, శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రీ 44వ వర్థంతి వేడుకలను సెప్టెంబర్ 10వ తేదీన టిటిడి నిర్వహించనుంది. 

ముందుగా ఉదయం 09.00 గం.లకు శ్వేత భవనం ముందు ఉన్న శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్తీ విగ్రహానికి, తదుపరి ఎస్వీ ఓరియంటర్ కాలేజీ పరిసరాలలో ఉన్న శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు.
అదేరోజు తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో మొదటి సెషన్ లో ఉదయం 10.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రీ, రెండో సెషన్ లో సాయంత్రం 06.00 గం.ల నుండి 08.00 గం.ల వరకు శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ లకు సంబంధించిన సాహితీ సదస్సు నిర్వహిస్తారు.

No comments :
Write comments