26.9.25

బ్రహ్మోత్సవాల్లో 28 రాష్ట్రాల నుండి సాంస్కృతిక కళా బృందాలు రాక art forms





శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటిసారిగా దేశంలోని 28 రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ రాష్ట్ర సాంప్రదాయ కళారూపాలను బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శించడంప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్ తెలిపారు. 

తిరుమలలోని రామ్ భగీచా-2 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ లో  ఆయన దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి లతతో కలిసిగురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను ఉత్సాహపరిచేలా అనేక ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు.
సెప్టెంబర్ 28న జరగనున్న గరుడసేవ రోజున దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన 37 బృందాలు తమ తమ రాష్ట్ర కళారూపాలను అద్భుతంగా ప్రదర్శించనున్నాయని వెల్లడించారు.
తిరుమలలోనే కాకుండా, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి ఆడిటోరియం మరియు శ్రీరామచంద్ర పుష్కరిణి ప్రాంగణంలో కూడా బ్రహ్మోత్సవ రోజుల్లో ప్రదర్శనలు ఇస్తూ భక్తులనుఅలరించనున్నారని చెప్పారు.
వాహన సేవల సమయంలో తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

No comments :
Write comments