11.9.25

శ్రీవారి మేల్చట్ వస్త్రాలకు రూ.43.45 లక్షలు విరాళం donaotion to melchat vastram




తిరుమల శ్రీవారికి ఒక సంవత్సరం పాటు వినియోగించే 55 సెట్‌ల మేల్చట్ వస్త్రాలకు అయ్యే రూ.43.45 లక్షలను బుధవారం వారణాసికి శ్రీ కాశీమఠం మఠాధిపతి శ్రీమద్ సమ్యమీంద్ర తీర్థ స్వామీజీ మార్గదర్శకత్వంలో ఆ మఠం ప్రతినిధి శ్రీ కే.నారాయణ షెనోయ్ అనే భక్తుడు బుధవారం విరాళంగా అందించారు.

ఈ విరాళానికి సంబంధించిన డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ జ్యోతుల నెహ్రూ, అదనపు ఈవో శ్రీ సి‌.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

No comments :
Write comments