8.9.25

శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం ముగిసిన చంద్ర గ్ర‌హ‌ణం ఉదయం 8.30 నుండి య‌ధావిధిగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌ lord venkanna darshan






తిరుమల, 2025 సెప్టెంబర్ 08: శ్రీ‌వారి ఆల‌యంలో సోమవారం ఉదయం 6 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. ఆదివారం రాత్రి 9.50 నుండి 1.31 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం సాయంత్రం 3.30 గంట‌ల‌కు ఆల‌యం త‌లుపులు మూశారు.
దాదాపు 12 గంట‌ల అనంత‌రం సోమవారం ఉదయం 3 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభం
చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంట‌లకు మూసివేసిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్సును 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం ఉదయం 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది.

No comments :
Write comments