19.9.25

రిసెప్షన్ విభాగంపై అదనపు ఈవో సమీక్ష addl eo review





సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో రిసెప్షన్ విభాగంపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వీఐపీలకు వసతి సౌకర్యంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా రిసెప్షన్, ప్రోటోకాల్ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు.
విశ్రాంతి గృహాలను పరిశీలించి ఏవైనా మరమ్మతులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. 
ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు.
అంతకు పూర్వం ఆయన అన్న ప్రసాద విభాగ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను కూడా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, వీజీవో శ్రీ సురేంద్ర, ఓఎస్డీ సత్రా నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments