26.9.25

శ్రీ‌వారి హంస‌ వాహ‌న సేవాలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు art forms



























శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండ‌వ‌ రోజైన గురువారం రాత్రి హంస వాహ‌న సేవ‌లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల నుండి వచ్చిన మొత్తం 21 కళాబృందాలు 536 మంది కళాకారులు తమ ప్రత్యేక నృత్యాలు, వాయిద్యాలు, భజనలతో భక్తులను మంత్రముగ్ధుల్ని చేశారు.

కేరళకు చెందిన క‌ళాకారులు కథాకళి, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన మ‌హిళ‌లు కూచిపూడి, భరతనాట్యం, కోలాటాలు, తప్పెటగుళ్ళు కనువిందు చేసింది. అదేవిధంగా గుజరాత్ - గర్భా నృత్యం, అస్సాం
 - సత్రియ నృత్యం, రాజస్థాన్ - జఖరీ నృత్యం, ఝార్ఖండ్  - చౌ నృత్యంతో అలరించారు.
మహారాష్ట్ర - లావణి, పశ్చిమ బెంగాల్ - రాధాకృష్ణ రాసలీల,  కర్ణాటక - హనుమాన్ చాలీసా నృత్య రూపకం, మహారాష్ట్ర మ‌రియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల‌కు చెందిన క‌ళాకారుల డ్రమ్స్ భ‌క్తుల‌ను మైమ‌రిపించాయి.
అదేవిధంగా దీపం నృత్యాలు,  భజనలు, జానపద నృత్యాలు, కోలాటాలు, భక్తి, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచాయి.

No comments :
Write comments