శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో బెంగళూరు కు చెందిన శ్రీ దక్షిణామూర్తి బృందం వీణా వాద్యసంగీత కచేరీ అత్యంత హృద్యంగమయంగా సాగి సభను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.
వీరు జగజ్జనని, ఎందరో మహానుభావులు, ఎంత ముద్దు ఎంత సొగసు, నానాటికి బతుకు నాటకము,భావములోనా మొదలైన పురందరదాస, త్యాగరాజ, అన్నమాచార్య కృతులను తమ వీణలో పలికించారు. వీరికి తమ వాద్యసంగీతంలో కంజీర పై బెట్టా వెంకటేష్, మోర్సింగ్ పై మోహిత్, మృదంగం పై వెంకటేష్ సహకారం అందించి సభను రక్తి కట్టించారు.
అన్నమాచార్య కళామందిరంలో....
అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6:30 నుండి 8:30 గంటల వరకు శ్రీమతి శ్రీదేవి, డాక్టర్ శారద బృందం గాత్ర కచేరి నిర్వహించారు.
శ్రీ కోదండ రామచంద్ర పుష్కరిణి లో సాయంత్రం ఐదు నుండి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి చిన్నమ్మ దేవి గాత్ర సంగీతం, హైదరాబాద్ కు చెందిన డాక్టర్ గౌతమి బృందం భరతనాట్యం ఆహుతులను అలరించింది.
ఈ కార్యక్రమం పెద్ద సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.





No comments :
Write comments