25.9.25

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు cultural





శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో తమిళనాడుకు చెందిన పి.ఆనంద్ జయరామ్ బృందం తమ నృత్య కళాకారులతో ప్రదర్శించిన "ఆండాళ్ రంగనాథుల కళ్యాణ వైభవ" భరతనాట్య సంప్రదాయ నృత్య రూపకం సభను అలరించింది.

ఈ కార్యక్రమం నృత్యాంజలితో ప్రారంభమయ్యింది. ఆపై గోదా స్తుతి, తదుపరి వర్ణం, శ్రీమన్నారాయణుని శ్రీపాదమే శరణు, దశావతారస్తుతి వంటి నృత్యములు నయనానందకరంగా సాగింది.
ఈ కార్యక్రమం హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో సప్తగిరి మాసపత్రిక సీనియర్ ఉప సంపాదకురాలు డా. అల్లాడి సంధ్య, భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments