27.9.25

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆకట్టుకున్న భక్తి సంగీత కార్యక్రమాలు devotional music


















తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆస్థాన మండపం, నాదనిరాజనం వేదికపై శుక్రవారం ఏర్పాటు చేసిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6.30 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేదపారాయణం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీ స్ఫూర్తి రావు బృందం గాత్ర సంగీతం నిర్వహించారు.
ఆస్థాన మండపంలో ఉదయం 7 గంటలకు హైదరాబాద్ కు చెందిన శ్రీ పార్థసారధి బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు రాయచూరుకు చెందిన శ్రీ వెంకటేశనవలి బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 గంటలకు భద్రాచలానికి చెందిన శ్రీ మురళి కృష్ణమాచార్యులు ధార్మిక ఉపన్యాసం ఇచ్చారు.
సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఆనంద బట్టర్ బృందం అన్నమయ్య సంకీర్తనలు సుమధురంగా ఆలపించారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కె.శారదా బృందం హరికథ గానం చేశారు.
మహతి కళాక్షేత్రంలో అనంతపురంకు చెందిన అరవింద్ ఆర్ట్స్ అకాడమీ శ్రీ సూర్యప్రసాద్ బృందం భరతనాట్య, కూచిపూడి సంప్రదాయంలో "అన్నమయ్య నృత్య నీరాజనం" సభను భక్తిమయ సాగరంలో ఓలలాడించింది.
ఇందులో నారాయణ తే నమో నమో, కొలువైతివా రంగశాయి, అదివో అల్లదివో, భావములోనా, గోవర్ధన గిరిధారి మొదలగు కీర్తనలకు చేసిన నృత్యములు భక్తజన లోకాన్ని అలరించింది.

No comments :
Write comments