30.9.25

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో అలరించిన భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు devotional programs






శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమ‌వారం తిరుమ‌ల‌లోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు భక్తులను విశేషంగా అలరించాయి.


తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి ర‌విప్ర‌భ‌, శ్రీ వి.సుబ్ర‌హ్మ‌ణ్యం, శ్రీ నాగేశ్వ‌ర‌రావు, శ్రీ కె.వినోద్‌, శ్రీ కె.విజ‌య్ కుమార్ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు ఎస్ వి ఉన్నతవేద విద్యాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద పారాయణం, మధ్యాహ్నం 1.30 గంటల నుండి 2.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీ సాయికిషోరి బోస్‌ బృందం అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. 

ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుప‌తి సాంప్ర‌దాయ పాఠ‌శాల‌కు చెందిన శ్రీమతి ల‌క్ష్మీ బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు తిరుప‌తికి చెందిన అర్చ‌న కుల‌క‌ర్ణి బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి 12.30 గంటల వరకు భ‌ద్రాచ‌లానికి చెందిన శ్రీ స్థ‌ల‌శాయి భక్తి సందేశం ఇచ్చారు. 

సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ఆర్‌.బుల్లెమ్మ‌ బృందం అన్నమయ్య సంకీర్తనలు, సాయంత్రం 5.30 నుండి 7 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన శ్రీమ‌తి జె.కృష్ణ కుమారి బృందం హరికథా గానం చేశారు.

No comments :
Write comments