4.9.25

కోసువారి పల్లి శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట kosuvaripalli




అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట చేపట్టారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, యాగ‌శాల‌లో పూర్ణాహుతి, పుణ్యాహవచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు జ‌రిగాయి. అనంతరం స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం చతుష్టానార్చన, పూర్ణాహుతి జరుగనుంది.


గురువారం పూర్ణాహుతి, పవిత్ర సమర్పణ చేపడతారు.  శుక్రవారం మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, స్నపన తిరుమంజనం, చక్రస్నానం చేపడుతారు.

No comments :
Write comments