5.9.25

శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో మహా పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు maha poornahuti





అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి  వారి ఆలయంలో గురువారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి.  ఇందులో భాగంగా ఉదయం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహా నివేదన, బలిహరన, తీర్థ ప్రసాద గోష్టి, సంభావన, పవిత్ర వితరణ తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.  


సాయంత్రం ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా వెళ్లి భక్తులకు ఆశీర్వదించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు శ్రీ దిలీప్ ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments