16.9.25

శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని mauritius pm









మారిషస్ దేశ ప్రధానమంత్రి శ్రీ నవీన్ చంద్ర రామ్గూలం సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. 
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్, ఈవోలు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ex- officio బోర్డు సభ్యులు శ్రీ దివాకర్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments