8.9.25

మ‌హా పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు pavitrotsavams









తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు ఆదివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మ‌ధ్యాహ్నం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన చేప‌ట్టారు.

చక్రస్నానం :
ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండ‌పంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చ‌క్ర‌త్తాళ్వార్‌ను ప‌ల్ల‌కీపై ఊరేగింపుగా ప‌ద్మ‌పుష్క‌రిణి వ‌ద్ద‌కు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 2.15 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఏఈఓ శ్రీ దేవరాజులు, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూపర్డెంట్లు శ్రీ రమేష్, శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ చ‌ల‌ప‌తి, శ్రీ సుభాష్‌ , విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments