హరికథా పితామహునిగా పేరున్న అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస 160వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఆయన విగ్రహానికి ఆదివారం ఉదయం కళాశాల ప్రిన్సిపాల్ డా.ఉమా.ముద్దుబాల, డిపిపి సెక్రటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్ లు ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.
అనంతరం కళాశాల విద్యార్థులు బృందగానం నిర్వహించారు. శ్రీ ఎస్వీ మ్యూజిక్ కళాశాల నుండి ఊరేగింపుగా మహతి ఆడిటోరియం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు డిపిపి కళాకారులు పాల్గొన్నారు.
No comments :
Write comments