4.9.25

శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట sri govindaraja swamy vari temple





తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం కల్యాణ మండపం నందు స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం చేపట్టారు.


సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం  చేపట్టారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

గురువారం మూలవర్లకు, ఉత్సవర్లకు ఉప సన్నిధిలో పవిత్ర సమర్పణ చేపడుతారు. అనంతరం విమాన ప్రాకరం, ధ్వజస్తంభం, మాడవీధులలోని శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడుతారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ పెద్ద జీయర్, శ్రీ శ్రీ చిన్న జీయర్లు, టిటిడి డిప్యూడీ ఈవో శ్రీ వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ లు, ఆలయ ఇస్పెక్టర్లు , అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments