4.9.25

శ్రీ నారాపుర వేంకటేశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణSri Narapura Venkateswara Swamy Temple




కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు.  ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, యాగ‌శాల‌లో పుణ్యాహవచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు జ‌రిగాయి.


అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. మూల‌వ‌ర్త‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు, విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్‌, బలిపీఠం ధ్వజస్తంభం, ప్రధాన కుంభానికి, ప‌రివార దేవ‌త‌ల‌కు పవిత్రాలు సమర్పించారు. ధ్వారాతోరణ ధ్వజకుంభ ఆరాధన, పవిత్ర హోమాలు, నివేదన, బలిహరన, శాత్తుమొర, ప్రసాద గోష్టి నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో శ్రీ ప్రశాంతి, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments