22.9.25

టీటీడీకి రైడ్ ఆన్ స్వీపర్ మెషిన్ విరాళం sweeper machine





యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీకి మల్టీ పర్పస్ క్లీనింగ్ కు ఉపయోగించే రూ.20 లక్షలు విలువైన రోస్సరి ప్రోఫెషనల్ కంపెనీకి చెందిన రాస్ స్ట్రీట్ ఆర్ఓ 1500 రైడ్ ఆన్ స్వీపర్ మెషిన్ ను ఆదివారం సాయంత్రం విరాళంగా అందించింది.

శ్రీవారి ఆలయం ముందు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి జీఎం శ్రీ పత్రి శ్రీనివాస్ ఈ మెషిన్ ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఆరోగ్యాధికారి డా. మధుసూదన్, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments