కలియుగ దై
ఈ సందర్భంగా ఈవో శ్రీ అనిల్ కు మార్ సింఘాల్ మాట్లాడుతూ, శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నా యని, గడువు లోపుగా ఏర్పాట్లు పూ ర్తి చేయాలని అధికారులను ఆదేశిం చారు. ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూ చనల మేరకు శ్రీవారి సేవలను మరిం త విస్తరించేందుకు చర్యలు చేపట్ టాలన్నారు. శ్రీవారి ఆలయ పవిత్ రతను కాపాడుకుంటూ, భక్తులకు ఇం కా ఎలాంటి మెరుగైన సేవలు అందిం చాలో ముఖ్యమంత్రిగారు సూచించా రన్నారు. అదేవిదంగా, టిటిడి చై ర్మెన్ వచ్చే ఫీడ్ బ్యాక్, బోర్ డు మెంబర్స్, డయల్ యువర్ ఈవో, ఐవిఆర్ఎస్, వాట్సాప్ ద్వారా అభి ప్రాయ సేకరణ, సర్వే తదితర మార్ గాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తు లను అభిప్రాయ సేకరణ తీసుకుని ఇం కా మెరుగైన సేవలను అందించే అంశం పై దృష్టి పెట్టాలని కోరారు. అదేవిధంగా, వీలైనంత వరకు ఆధుని క టెక్నాలజీ సాయంతో మరింత మెరు గైన సేవలు అందించే అంశంపై దృష్ టి పెట్టాలన్నారు. టిటిడిలో నా ణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్ దన్నారు.
ఉదయం కాలినడకన తిరుమల వస్తుంటే చాలా మంది భక్తులు టిటిడిలో అం దుతున్న సేవలపై సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. అలాగే, భక్తు లకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు చాలా రుచికరం గా, నాణ్యంగా ఉన్నట్లు భక్తులు చెప్పారన్నారు. తక్షణం చేపట్టే అభివృద్ధి పను లు, దీర్ఘకాలికంగా చేపట్టనున్న పనులపై కార్యాచరణ సిద్ధం చేయా లని సూచించారు. భక్తులకు అందిం చే సేవలతోపాటు, విధానపరమైన నిర్ ణయాలలో టిటిడి ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమిష్టిగా నిర్ణయం తీ సుకుని భక్తులకు వేగంగా, నాణ్యం గా సేవలు అందిద్దామన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, తిరుమలలో వసతి, అన్నప్రసాదాలు, డొనేషన్ తదితర శాఖలలో విధా నపరమైన వ్యవస్థలను తీసుకువచ్చా మని, దశల వారీగా టిటిడిలోని అన్ ని శాఖలలో ఇదే విధానాన్ని తీసు కువచ్చి వ్యవస్థలను పటిష్టం చే సేందుకు చర్యలు తీసుకుంటున్నట్ లు టిటిడి ఈవోకు నివేదించారు.
టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్ మం మాట్లాడుతూ, స్థానిక ఆలయాలలో మరింతగా అభివృద్ధి కార్యక్రమా లు చేపట్టేందుకు చర్యలు తీసుకుం టున్నట్లు వివరించారు. హింధూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా సనా తన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు పలు కార్యక్రమాలు చే పట్టినట్లు వెల్లడించారు. టిటి డి స్థానిక ఆలయాలను 14 జోన్ లు గా విభజించి, భక్తులకు మరింత మె రుగైన సేవలు అందించేందుకు కార్ యాచరణ చేపట్టామన్నారు.
టిటిడి సివిఎస్వో శ్రీ మురళీకృ ష్ణ మాట్లాడుతూ, అలిపిరి టోల్ గేట్ వద్ద ఆధునికరించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తు లు మోసాలకు గురికాకుండా ఎప్పటి కప్పుడు అవగాహన కల్పిస్తున్నా మని, అదే సమయంలో సైబర్ ల్యాబ్ ను అందుబాటులోకి తీసుకువస్తున్ నట్లు తెలిపారు.
మొదటగా ఉన్నతాధికారులు అందరూ తమ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను టిటిడి ఈవోకు వి వరించారు. ఈ కార్యక్రమంలో టిటి డిలోని పలు శాఖలకు చెందిన పలువు రు ఉన్నతాధికారులు పాల్గొన్నా రు.

No comments :
Write comments