14.9.25

టీటీడీ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ttd board






టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా దేవాదాయశాఖ సెక్రటరీ శ్రీ హరి జవహర్ లాల్, బోర్డు సభ్యులుగా శ్రీ సుదర్శన్ వేణు శనివారం శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు.

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments