తిరుమలలోని
ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన ఆయన ఆధునిక సాం కేతిక పరిజ్ఞానాన్ని వినియోగిం చి భక్తులకు మెరుగైన సేవలు అందిం చాలని అధికారులను ఆదేశించారు.
రోజు రోజుకూ మారుతున్న టెక్నా లజీని అనుసరించి నూతన సాఫ్ట్వే ర్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు.
తిరుమలలో మిస్సింగ్ పర్సన్స్ గు ర్తించే ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదే శించారు.
తిరుమలలోని ప్రతి అంగుళాన్ని మా నిటర్ చేయగల విధంగా సిబ్బందిని నియమించి కమాండ్ కంట్రోల్ సెం టర్ సామర్థ్యాన్ని పెంచాలని సూ చించారు.
రియల్ టైమ్‌లో వ్యక్తుల గుర్తిం పు, ఘటనలపై నిఘా కోసం ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను వినియోగిం చాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఈవో ఎల్&టీ సిబ్బం దితో కూడా టెక్నాలజీ వినియోగంపై చర్చించారు.
అనంతరం ఈవో లగేజీ కౌంటర్‌ను పరి శీలించి భక్తులతో మాట్లాడారు. దర్శన టోకెన్ పొందిన సమయం, దర్శనం పూర్తైన సమయాలను వాకబు చేశారు. ఈ సందర్భంగా భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ శ్రీవారి దర్శనం టీటీడీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్ లెక్స్ -2 కు చేరుకుని భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పర్యవే క్షించారు. ఈ సందర్భంగా శ్రీకా కుళం, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతాలకు చెందిన శ్రీవారి సే వకులతో మాట్లాడారు. భక్తులకు శ్ రీవారి సేవకులు అందిస్తున్న సే వల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు మరింత నాణ్యమైన శిక్షణ ఇచ్చి తద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీపీఆర్వో డాక్టర్ టి.రవికి సూ చించారు.
ఈ తనిఖీల్లో ఈవో వెంట సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, వీజీవోలు శ్ రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డా. మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.





















No comments :
Write comments