26.9.25

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులుVICE PRESIDENT OFFERS PRAYERS















భారత ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ , ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడులు  గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆయనకు స్వాగతం పలికారు. 
అనంతరం  ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
వేదాశీర్వచనం అనంతరం వారికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు. అటు తరువాత 2026 సంవత్సరానికి సంబంధించిన టిటిడి క్యాలెండర్లు, డైరీలను ఉపరాష్ట్రపతికి అందించారు. 
ఈ కార్యక్రమంలో పలువురు టిటిడి బోర్డు సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments