15.9.25

విజయవాడ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా మండలాభిషేకం vijayawada temple




విజయవాడలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం మండలాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట, శాంతి హోమం, అష్టోత్తర శత కలశాభిషేకం, పూర్ణాహుతితో  మండలాభిషేకం ఘనంగా ముగిసింది. 
సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు.
సాధారణంగా టిటిడి అనుబంధ ఆలయాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అష్ట బంధన మహా సంప్రోక్షణ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో మహా సంప్రోక్షణ నిర్వహించిన విషయం తెలిసిందే. మహా సంప్రోక్షణ తర్వాత 45 రోజులకు  మండలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు. 

No comments :
Write comments