2.10.25

బ్రహ్మోత్సవాల్లో రూ.9.41 కోట్లతో అభివృద్ధి పనులు: టీటీడీ సిఈ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌ engineering works




తిరుమల శ్రీవారికి ఈ ఏడాది నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో ఆధ్వర్యంలో రూ.9.41 కోట్లు సివిల్, ఎలక్ట్రికల్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగానికి రూ.5.61 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు టీటీడీ సిఈ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో బుధ‌వారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ఇంజినీరింగ్‌ విభాగం సేవలను వివరించారు.

ఈ సంద‌ర్భంగా సిఈ మాట్లాడుతూ, శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాలకు ఆరు నెలల ముందు నుండి ప్రణళికాబద్ధంగా సివిల్‌ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాటేజీలు, విశ్రాంతి సముదాయాలకు మరమ్మతులు చేసి అందుబాటులో ఉంచామని తెలిపారు. నాలుగు మాడవీధుల్లో భజన మండపాలు, పుష్కరిణికి మరమ్మతులు, గ్యాలరీల ఏర్పాటు, క్యూలైన్లు, తిరుమల రెండు ఘాట్‌  చేసినట్లు మరమత్తులు చేసినట్లు వివరించారు. వాహనాల పార్కింగ్‌ కోసం తిరుమల, తిరుపతిలో పార్కింగ్‌ ప్రదేశాలను అభివృద్ధి చేశామన్నారు.
భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించేందుకు 20 ప్రాంతాల‌లో హెల్ప్‌డెస్క్‌లు, పోలీస్ శాఖ‌వారి ఆధ్వ‌ర్యంలో 12 మే ఐ హెల్ప్ యు కౌంట‌ర్లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. భ‌క్తుల సౌక‌ర్య‌ర్థం సైన్ బోర్డులు ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. నిరంత‌రాయంగా నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. మొద‌టిసారిగా డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ కు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల వ‌స్తువులు అందుబాటులో ఉంచిన‌ట్లు తెలియ‌జేశారు. గ్యాల‌రీల‌లో మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించామ‌ని, మ‌రుగుదొడ్ల వ‌ద్ద ప్ర‌వేశ‌, నిష్క్ర‌మ‌ణ గేట్లు ఏర్పాటు చేశామ‌న్నారు.
ఈఈ - 5 శ్రీ వేణుగోపాల్ మాట్లాడుతూ, భ‌క్తుల‌కు ఎలాంటి ఆసౌక‌ర్యం క‌లుగ‌కుండా తిరుమ‌ల‌లోని పార్కింగ్ ప్రాంతాల‌ను అభివృద్ధి చేసి, వాహ‌నాలు నిలిపేందుకు మార్కింగ్‌, ఆయా ప్రాంతాల‌కు పేర్లు, అందుకు సంబంధించిన సైన్ బోర్డులు ఏర్పాటు చేశామ‌న్నారు. రెండు ఘాట్ రోడ్లలో మ‌ర‌మ‌త్తులు చేసిన‌ట్లు వివ‌రించారు.    
అనంతరం ఎలక్ట్రికల్ డిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ మాట్లాడుతూ, భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా తిరుమలలో వివిధ దేవతామూర్తులలో కూడిన  విద్యుద్దీపాల కటౌట్లు, ఎల్‌ఇడి ఆర్చీలు, తోర‌ణాలు ఏర్పాటు చేశామన్నారు. 3డి డైమెన్‌ష‌న్‌లో గ‌రుడ వాహ‌నంపై మ‌ల‌య‌ప్ప‌,  జిఎన్‌సి టోల్‌గేట్‌ నుండి రాంభగీచా అతిథి సముదాయం వరకు అదనంగా విద్యుద్దీపాలంకరణ చేపట్టినట్టు వివరించారు. శ్రీవారి వాహన సేవలు ఎక్కువ మంది భక్తులు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో 23, తిరుమలలో వివిధ ప్రాంతాలలో మొత్తం 13 ఎల్‌ఇడి వీడియో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటుచేసినట్టు వివ‌రించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల ఆధికారి డా|| టి.రవి, పిఆర్‌వో(ఇన్‌చార్జ్‌) కుమారి నీలిమ‌ పాల్గొన్నారు.

No comments :
Write comments