19.10.25

టీటీడీ ముద్రణాలయంలో ఘనంగా ఆయుధ పూజ ayudha pooja





తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా గల ముద్రణాలయంలో శ‌నివారం ఆయుధపూజ ఘనంగా జరిగింది.


ఈ సందర్భంగా శ్రీవారి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముద్రణాలయాన్ని అందంగా అలంకరించి అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ గల డిటిపి, ఆఫ్‌సెట్‌, మిష‌న్ సెక్ష‌న్‌, ఆర్టిస్టు, బైండింగ్‌ విభాగాల్లోని యంత్రాలకు ఆయుధపూజ చేశారు.

జెఈవో శ్రీ వి. వీర‌బ్ర‌హ్మం, ముద్రణాలయం డెప్యూటీ ఈవో శ్రీ‌ విజ‌య్‌కుమార్, పిఆర్‌వో(ఎఫ్ఏసి) కుమారి నీలిమ‌, యూనియన్‌ నాయకులు శ్రీ ఎన్‌. శ్రీనివాసన్‌, శ్రీ వి.కె.శ్రీనివాసులు, శ్రీ శ్రీనివాసమూర్తి, అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

No comments :
Write comments