తిరుచానూరు
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడు తూ, నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్ వహించనున్నట్లు చైర్మన్ శ్ రీ బీఆర్ నాయుడు చెప్పారు. తిరు మల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహా లో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్ వహిస్తామని తెలిపారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తి రుమంజనం జరుగనుందన్నారు. నవంబరు 16వ తేదీన లక్షకుంకుమార్చన, అం కురార్పణ నిర్వహిస్తారని చెప్పా రు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 17న ధ్వజారోహణం, 21న గజ వాహనం, 22న స్వర్ణరథం, గరుడ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమితీర్థం, 26న పుష్పయాగం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 8 నుండి 10 గం టల వరకు, రాత్రి 7 నుండి 9 గం టల వరకు వాహనసేవలు జరుగనున్నా యన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదన పు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జె ఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డె ప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments