2.10.25

చ‌క్ర‌స్నానం ఏర్పాట్ల‌ను తనిఖీ చేసిన‌ టిటిడి ఈవో chakrasnam










శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివ‌రి రోజైన‌ అక్టోబర్ 2వ తేదీ జ‌రుగ‌నున్న చ‌క్ర‌స్నానం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు నిర్వహించారు. పుష్కరిణి ప్రాంతంలోని నలువైపులా జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీ కె.వి.మురళీకృష్ణలతో కలిసి బుధవారం పరిశీలించారు.  

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,  భ‌క్తులు పుష్క‌రిణిలోకి ప్ర‌వేశించేందుకు, తిరిగి వెలుప‌లికి వెళ్లేందుకు వీలుగా గేట్ల‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిటిడి అధికారులు, విజిలెన్స్‌, పోలీసులు సమిష్టిగా స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఉద‌యం 6 గంటల నుండి 9 గంట‌ల మ‌ధ్య శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.
చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని ఈవో విజ్ఞప్తి చేశారు. పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్ర‌వేశించాల‌ని, భక్తులు సంయమనం పాటించి టిటిడికి సహకరించాలన్నారు. టిటిడి సూచించిన నిబంధనల మేరకు గ్యాలరీలలోని భక్తులు దశలవారీగా పుష్కరిణిలోకి ప్రవేశించేలని కోరారు.  
చక్రస్నానం సందర్భంగా 1,000 మంది పోలీసులు, 1300 మంది టిటిడి విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఫైర్, తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పుష్కరిణిలో  అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ  స‌మావేశంలో టిటిడి సిఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments