3.10.25

అహింస మార్గం ప్రపంచానికి ఆదర్శం : టిటిడి సంక్షేమ అధికారి శ్రీ ఆనందరాజు gandhi jayanthi





జాతిపితి మహాత్మా గాంధీ ఆచరించిన అహింస మార్గం ప్రపంచానికి ఆదర్శమని టిటిడి సంక్షేమ అధికారి శ్రీ ఆనందరాజు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా గురువారం టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

గాంధీజీ మార్గం నేటి యువతకు మార్గదర్శి అని వక్తలు చెప్పారు. అహింసా మార్గం ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించారని గుర్తు చేసుకున్నారు.  జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో మానవాళి సత్యం, అహింస మార్గాలను ఆచరించాలని కోరారు.
ఈ కార్య‌క్ర‌మంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments