18.10.25

శ్రీవారికి కొప్పెర హుండీ విరాళం koppera hundi




తిరుమల శ్రీవారికి శుక్రవారం కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుప‌తి స‌మీపంలోని కొప్పెర‌వాండ్ల‌ప‌ల్లెకు చెందిన శ్రీ కొప్పెర సాయిసురేష్‌ ఈ మేరకు హుండీని ఆలయంలో పోటు పేష్కార్ శ్రీ మునిరత్నంకు అందించారు.


రాగి, ఇత్త‌డితో క‌లిపి త‌యారుచేసిన ఈ హుండీ బ‌రువు 70 కిలోలు ఉంటుంద‌ని, దీని విలువ రూ.2.50 ల‌క్ష‌ల‌ని దాత‌ తెలిపారు. తాము 1821 సంవత్సరం నుండి వంశ‌పారంప‌ర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు స‌మ‌ర్పిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

No comments :
Write comments