29.10.25

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా న‌వ‌గ్ర‌హ హోమం navagraha homam






తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం న‌వ‌గ్ర‌హ హోమం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే.


ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కాలభైరవ స్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టారు.

అక్టోబ‌రు 29న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం

అక్టోబ‌రు 29వ తేదీ శ్రీ కాలభైరవ స్వామివారి హోమం జ‌రుగ‌నుంది. గృహస్తులు రూ. 500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య సూప‌రింటెండెంట్‌ శ్రీ చంద్ర శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments