1.10.25

తిరుపతిలో మైమరిపించిన ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు spiritual programs




శ్రీవారి సాలకట్లబ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ వరోజు మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. 


  తిరుపతి మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు  రాజమండ్రికి చెందిన డా.పి.సింధూరి వారి బృందం చేసిన "వాగ్గేయకార వైభవం" కూచిపూడి నృత్య ప్రదర్శన సభను భక్తి సాగరంలో ముంచెత్తింది.

  ఇందులో భాగంగా దశరథ తనయ, జయ జయ జయవర్షిణి అన్న అష్టలక్ష్మి కీర్తన, రామాయణ వైభవం అన్న అంశములపై సాగిన ప్రదర్శన అత్యంత రమణీయంగా, భక్తప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంది.

 అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు విజయవాడకు చెందిన శ్రీ చదలవాడ సిస్టర్స్ రామ పరిణయం నిత్య రూపకం పుర ప్రజలను విశేషంగా అలరించింది.  

 శ్రీ కోదండరామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు కాకినాడకు చెందిన శ్రీ పవన్ కుమార్ బృందం సుందరాకాండ తోలుబొమ్మలాట ప్రదర్శించారు. 
   
 ఈ కార్యక్రమంలో తిరుపతి పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments :
Write comments