25.10.25

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం subramanya homam





తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉద‌యం శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ రోజు నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు సుబ్రమణ్యస్వామి వారి హోమం జరుగనుంది.


ఇందులో భాగంగా యాగశాలలో శుక్రవారం ఉదయం పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వ‌హించ‌నున్నారు.

కాగా ఈ నెల 27వ తేదీ శ్రీ దక్షిణ మూర్తి స్వామి వారి హోమం జరుగనుంది. అనంతరం సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments