అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయంలో మంగళవారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం భాగవత ఆరాధన, మహా పూర్ణాహుతి, కుంభ ప్రక్షన, పవిత్ర విసర్జన, చక్రస్నానం తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
సాయంత్రం తిరుచ్చి వీధి ఉత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా వెళ్లి భక్తులకు ఆశీర్వదించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments