24.11.25

నవంబర్ 25న శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె saare




తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన నవంబర్ 25 తేదీ మంగళవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను పంప‌నున్నారుప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

 సంద‌ర్భంగా శ్రీవారి ఆలయంలో దయం 2.30 నుండి 4.30 గంటల వరకు పరిమళాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టిశ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపడతారు త‌రువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపుకుంకుప్రసాదాలుతులసివస్త్రాలుఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలవుతుంది.

 సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ‌తారుఅక్క‌డినుండి కోమ‌ల‌మ్మ స‌త్రంతిరుచానూరు పసుపు మండపం మీదుగా ప‌ద్మ‌పుష్క‌రిణి వ‌ద్ద అమ్మ‌వారికి సారె సమర్పించనున్నారు.

No comments :
Write comments