26.11.25

డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు vaikuta dwara darshanam

                     


మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ

చివరి ఏడు రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా సర్వదర్శనం

మొదటి మూడు రోజుల్లో SED, శ్రీవాణి దర్శనాలు రద్దు

స్థానికులకు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం

వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో తిరుపతిలో  SSD టోకెన్ల జారీ నిలిపివేత

ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలుఇతర ప్రత్యేక దర్శనాలుఆర్జిత సేవలు రద్దు

ఆన్ లైన్ అప్లికేష‌న్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 తేది వరకు నిర్వహించనున్ వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందిఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుందివైకుంఠ ద్వార దర్శనాల విధివిధానాలు వివరాలు ఇలా ఉన్నాయి.


ఎల‌క్ట్రానిక్‌ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ

వైకుంఠ ఏకాదశివైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలకు ఎల‌క్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారుకుటుంబ స‌భ్యులంద‌రికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.

నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 తేది వరకు ఎల‌క్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం

మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27 తేది దయం 10 గంటల నుండి డిసెంబర్ 1 తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/మొబైల్ యాప్ https://apps.apple.com/in/app/ttdevasthanams/వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎల‌క్ట్రానిక్‌  డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందిడిసెంబర్ 2 తేదిన మధ్యాహ్నం 2 గంటలకు ఎల‌క్ట్రానిక్‌ డిప్ వివరాలు భక్తులకు అందించబడతాయి.

వాట్సాప్ బాట్ లో నమోదు చేసుకునే విధానం

వాట్సాప్ బాట్ ద్వారా ఎల‌క్ట్రానిక్‌  డిప్ రిజిస్ట్రేష‌న్

No comments :
Write comments