29.11.25

న‌వంబ‌రు 30న అన్న‌మాచార్య క‌ళామందిరంలో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు gita chanting competition




టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో న‌వంబరు 30 తేదీన తిరుప‌తి అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు నిర్వ‌హించ‌నున్నారుటీటీడీ  విద్యాసంస్థ‌ల‌తో పాటు తిరుప‌తిలో స్థానికంగా చ‌దువుతున్న విద్యార్థినీ విద్యార్థులు  పోటీల్లో పాల్గొన్న‌వ‌చ్చు.


ఇందులో భాగంగా భ‌గ‌వ‌ద్గీత 14 అధ్యాయం (గుణత్రయ విభాగ యోగం)లో 6 నుండి 9 త‌ర‌గ‌తి విద్యార్థినీ విద్యార్థులు ఒక విభాగంగానుమరో విభాగంలో 10 త‌ర‌గ‌తి విద్యార్థినీ విద్యార్థులకు 16 అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగంపై పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.


అలాగే, 18 నుండి 45 సంవత్సరాల లోపు వారికి నిత్యజీవితంలో భగవద్గీత - భావ విశ్లేషణ అనే అంశంపై పోటీలు నిర్వహించనున్నారు


ఆస‌క్తిగ‌ల‌వారు న‌వంబ‌రు 30 ద‌యం 9 గంట‌ల‌కు తిరుపతి అన్న‌మాచార్య క‌ళామందిరంకు చేరవ‌లెనుమ‌రిన్ని వివ‌రాల‌కు 9676615643, 8500049345 నంబ‌రుకు సంప్ర‌దించాల్సి ఉంటుంది.


 పోటీల్లో గెలుపొందిన వారికి గీతాజయంతి సందర్భంగా డిసెంబ‌రు 1 తేదీన బహుమతులు ప్రధానం చేస్తారు.

No comments :
Write comments