24.11.25

పంచమితీర్థం ప్రాశ‌స్త్యం - ప‌ద్మ‌పుష్క‌రిణి విశిష్టత ammavari pushkarini






•  
న‌వంబ‌రు 25 పంచ‌మితీర్థం ( చక్రస్నానం)

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థంశ్రీపద్మావతి అమ్మవారు పద్మపుష్కరిణిలో విర్భవించిన తిథిని పంచమితీర్థంగా వ్యవహరిస్తారు.

ఈసారి బ్రహ్మూత్సవాల చివరి రోజై న‌వంబ‌రు 25 తేదీన కుంభ లగ్నంలో . 12.10 గం.  నుండి 12.20 గం. వరకు పంచమితీర్థ మహోత్సవం (చక్రస్నానం)వైభవంగా జరుగనుంది.

శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 1పురాణాల్లో పాద్మపురాణం ఒకటి. ఇందులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భావాన్ని వివరించారువైకుంఠ లోకంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారు శయనించి ఉండగా యజ్ఞానికి ఫలితమిచ్చే దైవం కోసం సప్తఋషులు వెతుకుతూ వచ్చారుస్వామివారు యోగనిద్రలో ఉండి భృగుమహర్షిని చూడలేదుకోపించిన భృగుమహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్నారుస్వామివారి వక్షస్థలంలో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారు ఆగ్రహం చెంది పాతాళ లోకానికి వెళ్లిపోయారు.

స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ పాతాళ లోకానికి వచ్చారుఅమ్మవారి ఆచూకీ కోసం భూమాత సహకారం తీసుకుని 56 దేశాలు తిరిగారుఅగస్త్య మహాముని ప్రతిష్ఠించిన కొల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు సమయంలో ఆకాశంలో శరీరవాణి వినిపించింది. ''స్వర్ణముఖి నదీతీరానికి వెళ్లి బంగారు పుష్పాలను తీసుకొచ్చి పూజలుతపం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు'' అని తెలిపిందిస్వామివారు స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకుని 'కుంతలముఅనే ఆయుధంతో పుష్కరిణిని తవ్వారువాయుదేవున్ని పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్గలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకురావాలని ఆదేశించారుస్వర్ణ కమలాలు వికసించేందుకు వైఖానసాగమోక్తంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించారు.

స్వామివారు క్షీరం(పాలు)ను మాత్రమే ఆహారంగా తీసుకుని 12 సంవత్సరాల పాటు శ్రీమంత్ర జప తప అర్చన చేశారు. 13 సంవత్సరం కార్తీక మాసంలో శుక్ల పక్షంఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం పంచమి తిథినాడు వాతావరణం ప్రసన్నమైందిసహస్రదళ బంగారుపద్మం నుంచి నాలుగు చేతులతోపద్మాల వంటి కళ్లతోసకల దివ్ ఆభరణాలువస్త్రాలుపుష్పాలతో శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించారుసత్యలోకం నుంచి బ్రహ్మ హంస వాహనంపైకైలాసం నుంచి పార్వతి పరమేశ్వరులు వృషభంపైసచిదేవి ఇంద్రుడుఅష్టదిక్పాలకులుసనకాది యోగులుసప్తఋషులుప్రహ్లాదుడు మొదలైన భక్తులుయక్షగరుడగంధర్వకిన్నెర, కింపురుషులు ఆకాశం నుంచి రాగా, దేవగంధర్వులు మంగళవాయిద్యాలు మోగిస్తుండగా తామరపూల మాలను శ్రీనివాసుని కంఠానికి శ్రీపద్మావతి అమ్మవారు అలంకరించారుశ్రీనివాసుడు తామరపుష్పాన్ని అమ్మవారికి అలంకరించారు. 108 దివ్యదేశాల్లో అమ్మవారు స్వామివారికోసం తపస్సు చేసినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉందితిరుచానూరులో మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కోసం శ్రీనివాసుడు తపస్సు ఆచరించినట్టు శ్రీ పాద్మపురాణంలో ఉండడం విశేషం.

పంచమితీర్థం ఉత్సవం క్రమం

చూర్ణాభిషేకం

పంచమితీర్థం రోజున ఉదయం ధ్వజారోహణ మండపంలో చూర్ణాభిషేకం నిర్వహిస్తారు రోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో అభ్యంగన స్నానం చేయిస్తారుఅమ్మవారి ఉత్సవమూర్తికి నువ్వుల నూనెచూర్ణపొడి కలిపి  క్రతువు నిర్వహిస్తారుఅమ్మవారిని ఆవాహన చేసి శ్రీ మంత్రం శ్రీ సూక్తం పఠిస్తారుఅభ్యంగన స్నానం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమితీర్థ మండపానికి వేంచేపు చేస్తారు.

పంచమితీర్థ మండపంలో

పంచమితీర్థ మండపంలో వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తినిశ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆశీనులను చేస్తారు. 9 కలశాల్లో ఆవాహన చేసి అనుజ్ఞ స్వీకరిస్తారువిష్వక్సేనారాధనపుణ్యహవచనంఉపచారాలు సమర్పిస్తారు సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారెపసుపు కుంకుమచందనంస్వామివారికి లంకరించిన వస్త్రాలుదివ్యమాలలుదివ్య ఆభరణాలులడ్డూవడ, అప్పం తదితర ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె ముందుగా తిరుపతిలోని శ్రీకోదండరామాలయంశ్రీగోవిందరాజస్వామివారి ఆలయాల మర్యాదలు స్వీకరించి తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకుంటుందిఅక్కడ తిరుచానూరు అమ్మవారి ఆలయ అధికారులు స్వాగతం పలికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళతారు.

శ్రీరామస్థూపం

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుష్కరిణి ఒడ్డున శ్రీరామస్థూపం ఉంది. 1970 దశకంలో శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌(పెద్దజీయర్‌స్వామి ఇక్కడ శ్రీరామస్థూపాన్ని నిర్మించారు సమయంలో రామహోమాదులు చేస్తూ 27 రోజులు రామాయణ పారాయణంహవనం నిర్వహించారుఅనంతరం శ్రీరామస్థూపంలో శ్రీరామకోటి పుస్తకాలను ఉంచి ప్రతిష్ఠ చేశారు.

No comments :
Write comments