నవంబర్ 28 నుండి డిసెంబర్ 13వ తేది వరకు తిరుమలలో జరగనున్న షోడశదిన సుందరకాండ పారాయణానికి ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఇందులో భాగంగా పుణ్యాహ వచనం, రక్షా బంధనం, మత్స్యంగ్రహణం క్యార్యక్రమాలతో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
ఈ పారాయణంలో భాగంగా నవంబర్ 28 నుండి డిసెంబర్ 13వ తేది వరకు ప్రతిరోజూ ఉదయం 8.30 నుండి 9.30 తిరుమలలోని వసంత మండపంలో సుందరకాండ పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఉదయం 9 నుండి 12 గంటల మధ్య ఆరాధన, అభిషేకం, హోమం, అనుష్టానం నిర్వహిస్తారు.
డిసెంబర్ 13వ తేదిన ఉదయం 11 నుండి 12 గంటల మధ్య ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది.
ఈ అంకురార్పణ కార్యక్రమంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అవధాని, వేద పండితులు పాల్గొన్నారు.
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
No comments :
Write comments