18.11.25

శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ AP ENDOWMENTS MINISTER






తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్,  ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.


అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, సిఎం చంద్రబాబు ఆలోచనల మేరకు టిటిడి ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు భక్తుల సంఖ్య పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టామన్నారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో పంచమి తీర్థం రోజున దాదాపు 50 వేలకు పైగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని,  పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించామన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల కోసం టీటీడీ అన్ని వ‌స‌తులు క‌ల్పించింద‌న్నారు. 
ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపది ముర్ము తిరుచానూరు, తిరుమలలో శ్రీ పద్మావతీ అమ్మవారిని, శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారని మాట్లాడారు. 

ఈ కార్యక్రమంలో విజివో శ్రీ గిరిధర్, ఏవీఎస్వో శ్రీ రాధాకృష్ణ మూర్తి, టిటిడి ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments