18.11.25

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌








రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న ప‌దిరోజుల‌ వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కే ప్రాధ‌న్య‌త‌నిస్తున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు వెల్ల‌డించారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌న విధి విధాన‌ల‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో టీటీడీ చైర్మ‌న్ అధ్య‌క్ష‌త‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది.


స‌మావేశంలో ముఖ్యాంశాలుః

  • డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం.
  • ఈ పది రోజులకు గాను 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటల దర్శనం సామాన్య భక్తులకు కేటాయింపు.
  • సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలను, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ర‌ద్దు.
  • జనవరి 2వ తేది నుండి 8వ తేది వరకు online ద్వారా రోజువారీ 15వేల (రూ.300)ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 1000 శ్రీవాణి టికెట్లను regular ప‌ద్ధ‌తిలో కేటాయింపు.
  • ఈ పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. ప్రివిలేజ్ దర్శనాలు రద్దు.
  • స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
  • మొదటి మూడు రోజులకు అన్ని టోకెన్లు కేవలం ఆన్ లైన్ ఈ-డిప్ ద్వారానే కేటాయింపు.
  • రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటించేందుకు మొదటి మూడు రోజులకుగాను భక్తులు టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ-డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేష‌న్ కు అవ‌కాశం.
  • న‌వంబ‌ర్‌ 27 నుండి 1వ తేది వరకు భక్తులు టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
  • డిసెంబర్ 2వ తేదిన డిప్ లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపడం జరుగుతుంది.
•  జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5వేల టోకెన్లు చొప్పున స్థానికులు First In First Out పధ్ధతిలో బుక్ చేసుకునేందుకు అవకాశం.

స‌మావేశంలోని ఇత‌ర ముఖ్యాంశాలు
  • భ‌క్తుల మ‌నోభావాల‌ను దృష్టిలో వుంచుకుని ప‌ర‌కామ‌ణి కేసును నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ చేసి బాధ్యుల‌పై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి నివేదించేందుకు బోర్డు నిర్ణ‌యం. ఈ కేసులో ఎంత‌టి వారున్నా బాధ్యుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల‌ని తీర్మానం.
•  ఈనెల 27వ తేదిన అమ‌రావ‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో రెండో ప్రాకారం నిర్మాణానికి భూమిపూజ‌లో రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు పాల్గొంటారు.


No comments :
Write comments