శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వాహన సేవల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
చిన్న శేష వాహనంలో భాగంగా సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రం నుండి గుస్సాడి, బతుకమ్మ, చెక్కభజనలతో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అదేవిధంగా, తిరుపతి ఎస్వీ మ్యూజిక్ కాలేజీ నుండి నృత్యం, కత్తి నాట్యం, రాజమండ్రి నుండి నెమలి డ్యాన్స్, అన్నమాచార్య ప్రాజెక్టు నుండి కోలాటం, కూచిపూడి నృత్యం, HDPP నుండి సాంప్రదాయ పాఠశాల కళాకారులు దీపలక్ష్మీ నృత్యం, దాస సాహిత్య ప్రాజెక్టు నుండి విజయవాడ కు చెందిన కోలాటం, కర్నాటక నుండి పద్మావతీ కల్యాణం భరత నాట్యం ఆకట్టుకున్నాయి.
అదేవిధంగా, తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో శ్రీ మునిరత్నం, శ్రీ కృష్ణారావు, శ్రీ చంద్రశేఖర్ బృందం మంగళధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి సరళ బృందం లక్ష్మీ సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన పండితులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు
ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎస్ వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ జయరామ్ బృందం భక్తి సంగీత కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నది.
అనంతరం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు తాడేపల్లిగూడెంకు చెందిన శ్రీ బాల సుందరం బృందం హరికథ గానం చేశారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి మాధురి బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఊంజల సేవలో తిరుపతికి చెందిన శ్రీ రంగనాథ్ బృందం అన్నమయ్య సంకీర్తనలను గానం చేశారు.
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటల నుండి రాజమండ్రి కి చెందిన శ్రీమతి లక్ష్మీ దీపిక బృందం కూచిపూడి నృత్యం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6:30 గంటల నుండి బెంగుళూరు చెందిన శ్రీమతి శ్రీమతి సత్యబాంబ బృందం, కర్నూలుకు చెందిన శ్రీ ఆంజనేయులు బృందం భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ కు చెందిన శ్రీ పృథ్వీరాజ్ నామ సంకీర్తన భక్తులను ఆకట్టుకుంది.
తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులచే గానం మురళీ గానం, కూచిపూడి నృత్యం ప్రదర్శించారు.


.jpg)

No comments :
Write comments