17.11.25

శ్రీవారి మెట్టు వద్ద ఘనంగా కార్తీక వనభోజనం karthika vana bhojanam








పవిత్ర కార్తీకమాసం సందర్భంగా  ఆదివారం శ్రీవారి మెట్టు వద్ద గల పార్వేట మండపంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది.


ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవరులను ఊరేగింపుగా పార్వేటిమండపానికి తీసుకొచ్చారు. స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు.  అనంతరం పార్వేట మండపంలో మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం జరిగింది.

అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.
         
ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ లు శ్రీ రాజ్ కుమార్, రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ లు శ్రీ ధనశేఖర్, శ్రీ ముని కుమార్, అర్చకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments