20.11.25

మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ప్రత్యేక అభిషేకం lakshmi narasimha swamy vari temple






తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని అలిపిరి నడకమార్గం లో వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి బుధవారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. 

పవిత్ర కార్తీక మాసంలో స్వాతి తిరు నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం అడిషనల్ ఈవోను శ్రీవారి ఆలయ పోటు పేష్కార్ శ్రీ మునిరత్నం సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఇతర టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments