26.11.25

శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె srivari sare







తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను స‌మ‌ర్పించారు.

ఇందుకోసం ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి 4.30 గంటల రకు పరిమళాన్ని(నామకోపుశ్రీ చూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుకిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమంవిమా ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు తరువాత గర్భాలయంలో శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేప‌ట్టారుఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపుకుంకుమప్రసాదాలుతులసివస్త్రాలుఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది సారెను టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించిన‌ అనంతరం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ల‌యానికి తీసుకెళ్లారు

 ఏడాది పద్మావతి అమ్మవారికి రూ.1.30 కోట్లు విలువైన 1071 గ్రాముల బంగారు కమలముల హారం, 68 గ్రాముల వజ్రాల అడ్డిగ ఆభరణాలను తయారు చేయించారు‌.

 సందర్భంగా అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పంచమి తీర్థం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారుసారెతో పాటు ఆభరణాలను కూడా సమర్పిస్తున్నట్లు తెలియజేశారు.

 కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామిశ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి,  బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మిశ్రీమతి ప్రశాంతిశ్రీమతి జానకి దేవిశ్రీమతి రంగశ్రీ, jeo శ్రీ వీరబ్రహ్మం,సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంత‌దిత‌రులు పాల్గొన్నారు.

No comments :
Write comments